Thursday, 21 June 2018

TDP, BJP ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు?

TDP, BJP  ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 అమలు మరియు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర సహాయం . 

నిజ స్వరూపం.

కొద్దీ వారాలుగా చాలామంది చాలా రకాలుగా చట్టం లో వాస్తవంగా పొందుపరిచిన విషయాలు, వాటి అమలు తీరు పై సరైన అవగాహన లేక ప్రకటనలు చేస్తున్నారు. . 

కేంద్ర సహాయం విషయం లో ఈ ప్రకటనలు నిజాలు వక్రీకరించి తప్పు దారి పట్టించే విధం గా ఉన్నాయి .

ఇప్పుడు ప్రజల ముందు వాస్తవాలు పెట్టవలిసిన సమయం ఆసన్నమైంది.

ప్రస్తుతం ఆరు విషయాల్లో చర్చ జరుగుతుంది.  వీటి పై ఈ క్రింద విశ్లేషణ కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు విషయాల్లో ఎంత నిస్సందేహంగా ఎంత చురుకు గా పని చేస్తుందో స్పష్టం అవుతోంది.

చాలా పనుల్లో 10 సంవత్సరాల కాల పరిధి ఉన్నపటికీ కొత్త రాష్ట్రం కు ఆర్ధిక అవసరాలు తీర్చటం లో మౌలిక సదుపాయాల కల్పన లో కేంద్ర ప్రభుత్వం ఎంతో చురుకు గా వ్యవహరిస్తోంది.
ముందుగా చట్టం లోని అంశాలు వాటి అమలు గురించి మొదలు పెడదాం.                             

1. కేంద్ర ప్రభుత్వం ఎన్నాళ్లలో ఏమిమి చేస్తాను అని చెప్పింది. చట్టం లో సెక్షన్ 93 ప్రకారం రాష్ట్రం అభివృద్ధి మరియు స్వాలంబన కొరకు 13 షెడ్యూల్ పేర్కొన్న విషయాలు అన్ని 10 సంవత్సరాల కాల పరిధిలో చేయటానికి కట్టుబడి ఉంది. అంటే కాల పరిధి 10 ఏళ్ళు!             

2. 13 షెడ్యూల్ లో ఏ ఎ విషయాలు ఉన్నాయి ? దీనిలో 2 భాగాలు ఉన్నాయి.

ఒకటి విద్య సంస్థలు రెండోది మౌలిక సదుపాయాలు.

ముందు విద్య సంస్థలు గురించి చర్చిద్దాం.

11 విద్య సంస్థలు రాబోయే 10 ఏళ్ల కాలం లో లేదా 2022 సంవత్సరం ఆఖరు అనగా 13 పంచవర్ష ప్రణాళిక ఆఖరు నాటికి ఏర్పాటు చేయాలి.

13 షెడ్యూల్ ఏమి చెబుతుందంటే 12 , 13 పంచవర్ష ప్రణాళికల లో తలపెట్టిన జాతీయ ప్రాముఖ్యం కలిగిన విద్య సంస్థలు కొత్త గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పాటు చేయాలి.

అవి ఏమిటంటే ఒక ఐఐటీ , ఒక నిట్ , ఒక ఐఐఎం , ఒక ఐఐఎస్ఇఆర్, ఒక సెంట్రల్ యూనివర్సిటీ , ఒక పెట్రోలియం యూనివర్సిటీ , ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ , ఒక ఐఐఐటి. ఇవి కాకుండా ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషలిటీ టీచింగ్ హాస్పిటల్. ఒక గిరిజన యూనివర్సిటీ.ఒక ఏన్ఐడిఎం కూడా.
రాబోయే పది సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలి. ఇలా కట్టుబడిన విషయంలో ఇప్పటికే ఏమి చెయ్యబడ్డాయి ?

11 విద్యా సంస్థల్లో 9 సంస్థలు నిర్దేశించిన కాలం కన్నా చాలా ముందుగానే మొదలు అయ్యేయి. కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి, కొన్నింటికి శంకుస్థాపన లు జరిగేయి.

మంగళగిరి లో ఎయిమ్స్ కు నిధులు కూడా ఇవ్వటం జరిగింది.

2018 బడ్జెట్ లో గిరిజన విశ్వవిద్యాలయం మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయం కు నిధులు కేటాయించటం జరిగినది. ఈ రెండు విద్యాలయాలు ప్రారంభించటానికి కావలిసిన చట్టపరమైన ఆమోదం కోసం చర్యలు తీసుకున్నాం.
అనంతపురం లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆమోదించబడింది. ఇక మిగిలింది గిరిజన విశ్వవిద్యాలయం.

ఇచ్చిన హామీలు నెరవేర్చుటకు సత్వర కార్యాచరణ స్పష్టంగా కనిపిస్తుంది.

చట్టం క్షేత్రస్థాయిలో కార్య రూపం దాల్చటానికి చేయవలిసిన పనులు గట్టిగా చేయటం,

అలాగే ఇవి అత్యవసరం అనే స్పృహ కలిగి ఉన్నాం.                                               

ఇక 8 మౌలిక ప్రాజెక్టులు చేపట్టవలిసి ఉన్నది. అందులో 6 ప్రొజెక్టులలో సాధ్యాసాధ్యలు పరిశీలించిన పిదప చేపట్టవలిసి ఉంది.

మిగతా రెండు ప్రొజెక్టులలో చర్యలు మొదలు పెట్టవలసిఉంది.

13 షెడ్యూల్ లో మొత్తం 12 ప్రాజెక్టులు లో 8 ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి.వాటిలో 6 వాటికి  6 నెలల లోపు మిగతా వాటికి 2 ఏళ్ల లోపు చర్యలు మొదలుపెట్టాలి.
ఆ విధంగా ఒక వైపు సాధ్యాసాధ్యలు పరిశీలించాలి మరొక వైపు 2 ప్రాజెక్టులు 10 ఏళ్ల లోపు పూర్తి చేయటానికి కావలిసిన చర్యలు మొదలుపెట్టాలి.

ఇచ్చిన హామీ కి కట్టుబడి ఏమీ చేసేరు ?

మూడు ప్రాజెక్టులు సాధ్యం గా ఉన్నాయి.

మరొక మూడు అసాధ్యం గా ఉన్నాయి.

కానీ ఆ మూడు కూడా మళ్లీ పునసమీక్షించి మొత్తానికి 5 ప్రోజెక్టుల పై చర్యలు కు మొదలు పెట్టటం జరిగింది.

1. కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ స్థాపించుటకు హెచ్పీసీల్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన సాంకేతిక మరియు వాణిజ్య పరమైన నివేదిక తయారు చేస్తున్నారు.               
2. ఢిల్లీ ముంబాయి పారిశ్రామిక కారిడార్ మాదిరిగా వైజాగ్ చెన్నై కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలించి సత్వరం స్థాపించుటకు నిర్ణయించింది. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయమని అనుమతి ఇచ్చింది.
దీన్ని చెన్నై మీదుగా కలకత్తా వరకు కలపాలి అని 2014 లో సంకల్పించేరు.

మొదటి దశ గా 800 కిలోమీటర్లు వైజాగ్ - చెన్నై ఎకనామిక్ కారిడార్ చేపట్టారు.

631 మిలియన్ల డాలర్ల రుణం మరియు గ్రాంట్ రూపేణా ఏడిబి మంజురు చేసింది.

అందులో 2500 కోట్లు మొదటి విడత గా విడుదల చేసింది.

3 భారత ప్రభుత్వం విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి ఎయిర్ పోర్ట్ లను అంతర్జాతీయ స్థాయి కి పెంచి వాటిని ప్రారంభించటం కూడా జరిగింది. 4. భోగాపురం విమానాశ్రయానికి అనుమతి ఇవ్వటం జరిగింది.

5.విజయవాడ లో కొత్త టెర్మినల్ మరియు రన్ వే పొడిగింపు జరిగింది.

6.తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి కి పెంచి ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేసేరు.

7. రాజమండ్రి లో రాత్రి పూట విమానాలు నడుపుతున్నారు. అలాగే రన్ వే పొడిగింపు చేస్తున్నారు.

8. కడపలో కొత్త టెర్మినల్ ప్రారంభించారు. 

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుండి హైద్రాబాదు మరియు ఇతర ముఖ్య పట్టణాలకు రైల్ మరియు రోడ్ శీఘ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
1. 20,000 కోట్ల వ్యయం తో అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే,
2. 19,700 కోట్ల వ్యయం తో అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు కోసం జాతీయ రహదారుల సంస్థ నిధుల మంజూరు చేసింది.
అలాగే కొత్త రాజధాని అమరావతి తో రైల్ అనుసంధానం కోసం
1. విజయవాడ గుంటూరు మధ్య 2679 కోట్ల వ్యయం తో కొత్త రైల్ మార్గం మంజూరు చేసేరు.
2. నడికుడి శ్రీ కాళహస్తి మధ్య 309 కిలోమీటర్లు దూరం 340 వ్యయం తో కొత్త రైల్ మార్గం మంజూరు చేసేరు.
3. గుంటూరు గుంతకల్ మధ్య 443 కిలోమీటర్లు దూరం రైల్ లైన్ డబ్లింగ్ మరియు విద్యుతీకరణ కోసం 3631 కోట్లు మంజూరు చేసేరు .
4. విజయవాడ విశాఖపట్నం లో మెట్రో రైల్ మార్గాల పరిశీలన చేసి విజయవాడ లో 26 కిలోమీటర్లు 6769 కోట్ల వ్యయంతో మెట్రో నిర్మాణం కొరకు సూత్రప్రాయంగా అనుమతి మంజూరు చేసేరు. నూతన మెట్రో విధానం కోసం ఈ ప్రాజెక్ట్ ఆగింది.
 ఆవిధంగా విజయవాడ మెట్రో రైలు డిపిఆర్ కొత్త మెట్రో పాలసీ ప్రకారం సవరించి పంపమని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపడమైనది.

కొత్త డిపిఆర్ రాష్ట్రం నుంచి ఇంకా రావాలి.

అలాగే విశాఖపట్నం మెట్రో డిపిఆర్ కూడా రావాల్సి ఉంది.

ఇక 3 ఇతర ప్రాజెక్టులు ఏవైతే సాధ్యం కాదు అనుకున్నామో వాటిని మరో సారి పునసమీక్షించటం జరుగుతుంది.

అందులో క్లిష్టమైన ఒక ప్రాజెక్ట్ దుగరాజపట్నం పోర్ట్. దీన్ని నీతి ఆయోగ్ ఆమోదించలేదు. 

ఇది కాక పోతే మరో చోట పోర్ట్ త్వరితగతిన నిర్మాణం కోసం బడ్జెట్ 2018 సమావేశాల్లో జరిగిన చర్చలో కేంద్ర ఆర్ధికమంత్రి సంసిద్ధత వ్యక్తం చేసేరు.
కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై టాస్క్ ఫోర్స్ తొందరలో అందుతుంది అని ఎదురు చూస్తున్నాం. కొత్త రైల్వే జోన్ అంతర రాష్ట్ర సమస్యలు దృష్టిలో పెట్టుకుని పరిశీలించాలి.

ఇప్పుడు అది నిర్ణయం దశలో ఉంది.

కేవలం సాంకేతిక పరమైన అంశాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన భరోసా ప్రకారం అన్ని ప్రాజెక్టులు నేరుగా లేక ప్రత్యామ్నాయ పద్దతిలో నిర్మించే దిశగా సకరాత్మగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నివేదికలు రాగానే ప్రాజెక్టులు ప్రారంభించే చర్యలు ఉంటాయి.

నిర్దుష్టమైన కాల పరిధిలో చేబట్టటం జరుగుతుంది.

చట్టం లో నిర్దేశించిన 10 ఏళ్ళు ముందే ఈ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆశిస్తున్నాం.

స్పెషల్ కేటగిరీ స్టేటస్ .

వాస్తవ పరిస్థితి ఏమిటి ?

గత ప్రభుత్వం పార్లమెంట్ లో మౌఖికింగా చెప్పిన ఆ విషయం పునర్విభజన చట్టం లో పొందు పరచలేదు. కనీసం ప్లానింగ్ కమిషన్ కు కూడా పంపలేదు.
14 ఆర్ధిక సంఘం "ఆర్ధిక సహాయం , పన్ను రాయితీలు కోసం  రాష్ట్రాల మధ్య  సాధారణ మరియ ప్రత్యేక అని భేదం లేదు. మేము చేసే సూచనలు సిఫారసుల లో అలాంటి వత్యాసం ఏమి పరిగణించలేదు. రాష్ట్రాల వనరులు మదింపు లో ఆయా రాష్ట్రాల ఇబ్బందులు అవసరాలు పరిగణనలోకి తీసుకున్నాం" అని చెప్పింది.

కానీ కేంద్రం చట్టాన్ని మించి ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయటానికి పూనుకుంది.

ప్రధాని మంత్రి మార్గదర్శకత్వములో కేంద్రమంత్రి మండలి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి పై ద్రుష్టి పెట్టేరు.

వారు కేవలం చట్ట పరిధిలోనే పరిమితి కాకుండా ఇంకా అధికం గా ప్రత్యేకంగా అనేక ప్రాజెక్టులు సుమారు 3 లక్షల కోట్లు విలువైనవి అమలు చేస్తున్నారు.
14 ఆర్ధిక సంఘం సిఫారసులు తరువాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో కలిసి చాలా కసరత్తు చేసింది.

కొత్త రాష్ట్రానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు , నష్టాలు లెక్కవేసి అందరితో సంప్రదించి ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలి అని నిర్ణయించింది.

ఈ ప్రక్రియ వెంకయ్యనాయుడు గారి సమన్వయంతో ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సంప్రదింపులు జరిపిన పిదప కేంద్రం ప్రత్యేక సహాయం 8 సెప్టెంబర్ 2016 లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్ర సహాయానికి చట్టబద్దత కల్పించమని కోరింది.

15మార్చ్ 2017 లో కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదముద్ర వేసింది.

విదేశీ నిధుల సహాయంతో చేపెట్టే ప్రాజెక్టులు ద్వారా ఈ ఆర్ధిక సహాయ భర్తీ చేయాలని మొదట నిర్ణయించేరు. ఇది సుమారు 16500 కోట్లు గా నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు దేశీయ నిధుల తోనే సహాయం చేయటానికి అంగీకరించి అందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు చేసుకోమని కేంద్రం చెబితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

ఈ ప్రత్యేక సహాయం లో పెద్ద లిస్ట్ ఉంది.

600 కోట్లతో పాలసముద్రం  అనంతపురం NACEN ,
50 కోట్ల తో సూరంపల్లి లో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ ,
250 కోట్ల తో నేషనల్ ఓషన్ రీసెర్చ్ సెంటర్
నెల్లూరు లో
500 కోట్లతో జాతీయ విద్య పరిశోధన కేంద్రం నెల్లూరులో
110 కోట్ల తో సూక్ష్మ , చిన్న, మధ్య తరహా  పరిశ్రమల సాంకేతిక  కేంద్రం నెల్లూరులో ,

25 కోట్లతో కామధేనువు బ్రీడింగ్ సెంటర్ చింతలదీవి
నెల్లూరులో ,
20 కోట్ల తో ప్రాంతీయ మానసిక రుగ్మతలు పునరావాస కేంద్రం నెల్లూరులో
జాతీయ పాక శాస్త్ర కేంద్రం తిరుపతిలో , దూరదర్శన్ కేంద్రం విజయవాడలో,
ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం విజయవాడ లో , పాస్ పోర్ట్ సేవ కేంద్రం భీమవరంలో ,
ఎప్పుడో 2008 లో తలపెట్టిన ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ స్కూల్ విజయవాడ లో నిర్మాణం మొదలుపెట్టారు.
140000 కోట్ల  పెట్రో కెమికల్స్ ,
38500 కోట్లు తో విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ , నైట్ విషన్ ఆప్టిక్ పరికరాలు కేంద్రం నిమ్మకూరు లో ,
1000 కోట్లతో బెల్ కంపెనీ వారి క్షిపణి కూర్పు సౌకర్య కేంద్రం ,
రాంబిల్లి లో నేవి బేస్ ,
బొబ్బిలి లో నేవీ ఎయిర్ స్టేషన్ ,
నాగాయలంక లో డి ఆర్ డి ఓ వారి క్షిపణి ప్రయోగ పరీక్షా కేంద్రం.
500 కోట్ల తో జాతీయ ఓపెన్ ఎయిర్ ఎవల్యూషన్ సెంటర్ కర్నూల్ లో
500 కోట్ల తో ట్రూప్స్ సెంటర్ చిత్తూరు లో ఏర్పాటు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పట్టణ గృహ నిర్మాణాలు పై అధిక శ్రద్ద పెట్టింది. అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు గారు చొరవతో 10200 కోట్లు సహాయం తో 6.8 లక్షల గృహాలు.

1500 కోట్లతో 4 స్మార్ట్ పట్టణాలు మంజూరు చేసింది.

విశాఖపట్నం తిరుపతి కాకినాడ 196కోట్లు చొప్పున 588 కోట్లు ఇప్పటికే విడుదల చేసినారు. హడ్కో ద్వారా 7500 కోట్లు రాజధాని నిర్మాణానికి 2000 కోట్లు విజయవాడ , గుంటూరు , నెల్లూరు భూగర్భ డ్రైనేజీ మరియు త్రాగు నీరు కోసం మంజూరు చేసింది.

33 పట్టణాలకు అమృత స్కీం క్రింద స్వచ్ఛ భారత్ క్రింద 588 కోట్లు మంజూరు చేసింది.

విశాఖలో పోర్ట్ ఆధునీకరణ కోసం 913 కోట్లు, కంటైనర్ కార్పొరేషన్ బహుళ రవాణా వ్యవస్థ కోసం 450 కోట్లు , కంటైనర్ స్టేషన్ కోసం 100 కోట్లు, ఇన్నర్ హార్బర్ టర్నింగ్ సర్కిల్ కోసం 280 కోట్లు ఖర్చుపెడుతుంది.

కేంద్రం విద్యుత్ కోసం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు సహాయ చేస్తుంది. అందరికి విద్యుత్ పధకం లో 4400 కోట్లు ఉజ్వల డిస్కామ్ ఆస్యూరెన్సు క్రింద , సోలార్ పార్కు లు మెగా సోలార్ ప్రాజెక్ట్ 24000 కోట్లతో తలపెట్టింది.
గ్రీన్ ట్రాన్స్మిషన్ కారిడార్ పథకం క్రింద 520 కోట్లు ఇండో జర్మనీ రుణం మంజూరు చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం స్టేట్ విమానయాన రైల్వే రంగాల్లో పెట్టుబడులు పెంచేరు.

రాజమండ్రిలో రాత్రిపూట విమానాలు రాకపోకలు , కడపలో కొత్త టెర్మినల్ ప్రారంభించారు.

450 కోట్లతో మల్టీ మోడ్ లాజిస్టిక్ పార్క్ కాకినాడలో త్వరలో పెట్టబోతున్నారు.

2018 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లో రైల్వే లకు ఎప్పుడు ఇవ్వనంత 3406 కోట్లు కేటాయింపులు.
50000 కోట్ల ప్రాజెక్టులు నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి.

23137 కోట్ల తో 2584 కి మీ లైన్లు డబ్లింగ్ చేస్తున్నారు.

20301 కోట్లు తో 2213 కి మీ కొత్త లైన్లు నిర్మిస్తున్నారు.

26403 కోట్లు తో 15 కొత్త ప్రాజెక్టులు మంజూరు అయ్యేయి.

ఆంధ్రప్రదేశ్ లో రవాణా వ్యవస్థ మెరుగు పరచట కోసం బకింగ్ హమ్ కెనాల్ పునరుద్ధరణ 7015 కోట్లతో మొదలు పెట్టిన పెద్ద ప్రాజెక్ట్ .

278 కోట్లతో నెల్లూరు లో తోళ్ల పరిశ్రమ

20 కోట్లతో గుంటూరు లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ వలన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వచ్చేయి.

80 కోట్ల తో గంభీరం లో ఎలక్ట్రో మాగ్నాటిక్ ఎన్విరాన్మెంటల్ సెంటర్ ,

విశాఖపట్నం లో లక్ష చదరపు అడుగుల ఐటీ సెంటర్ ,
చిత్తూరు లో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మాన్యు ఫ్యాక్చరింగ్ సెంటర్ ,

విశాఖపట్నం లో 300 పడకల సూపర్ స్పెషలిటీ , కృష్ణ జిల్లాలో యోగ మరియు నాచారోపతి కేంద్రం పెడుతున్నారు. 

టూరిజం అభివృద్ధి కోసం 70 కోట్ల తో కాకినాడ వద్ద హోప్ ఐలాండ్  , 61 కోట్లతో నెల్లూరు టూరిజం సర్క్యూట్ మంజూరు చేసింది.

20000 కోట్ల వ్యయం తో వైద్య పరికరాలు ఉత్పత్తి కేంద్రం పిపిపి మోడల్ లో త్వరలో విశాఖలో వస్తుంది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఆంధ్రప్రదేశ్ లో వెనుక బడిన 7 జిల్లాలు లో పరిశ్రమలకు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించింది.

ఇవి అన్ని కేంద్రం అసాధారణ రీతిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సహాయ చేస్తున్న తీరుకు దర్పణం పడుతుంది.

కానీ కొంత మంది వీటిలో ప్రత్యేకత ఏమి ఉంది ఇవి మాములుగా కూడా వస్తాయి అని విమర్శిస్తున్నారు.

ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఉదాహరణకు ఇంతకుముందు 3 ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రంల్లో 16, 17 ఏళ్ల క్రితం దూరదర్శన్ కేంద్రంలు బడ్జెట్ లో నిధులు కేటాయించక ఇంకా ప్రారంభం కాలేదు .
జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 2000 లో ఏర్పడ్డాయి. వాటికి 2017 లో దూరదర్శన్ కేంద్రాలు మంజూరు అయ్యింది. అదే ఆంధ్రప్రదేశ్ కు తక్షణమే మంజూరు అవ్వటమే కాదు ప్రారంభించి ప్రసారాలు కూడా మొదలు అయ్యేయి.

పోలవరం ప్రాజెక్ట్ .

సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించేడు.

నేటి ప్రభుత్వం సత్వరం పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయాలని దృఢ సంకల్పం తో ఉంది.

1981 లో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ 30 ఏళ్ళు పాటు మొదలు పెట్టలేదు.

ఇది సత్వరం పూర్తి కావాలిసిఉన్నది అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిచటానికి వెసులుబాటు కల్పించడమైనది.

ఇది సత్వరం పూర్తి కావడానికి అడ్డంకి గా ఉన్న ముంపు మండలాల ను ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు బదలాయించడం జరిగింది. ఆ వెనువెంటనే పార్లమెంట్ ఆమోదంతో చట్ట సవరణ చేయడం జరిగింది.
చట్టం లో నిర్దేశించే న ప్రకారం 2014 నుండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై పెట్టిన ఖర్చు 100 శాతం ఇవ్వటానికి నిర్ణయించాము.

రాజధానికి ఆర్ధిక సహాయం .

సెక్షన్ 94 ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాలు , అసెంబ్లీ , శాసన మండలి , రాజభవనం , హైకోర్టు , సచివాలయం మొదలైన వాటికోసం ఇవ్వవలిసి ఉన్నది.

ఆ విధంగా 2500 కోట్లు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. మరో 1000 కోట్లు ఇస్తాము.

అదేవిధం గా రాజధాని కోసం అటవీ భూముల డి నోటిఫై చెయ్యవలిసి ఉన్నది. 217 చ. కిమీ విస్తీర్ణం లో అటవీ భూములు , కొత్త రాజధాని అమరావతి కోసం అనుమతి ఇవ్వటం జరిగింది.
ఇదంతా రికార్డ్ టైం లో చేయటం జరిగింది. లేకుంటే కొత్త రాజధాని నిర్మాణం చాలాకాలం ఆలస్యం జరిగి ఉండేది.

ముగింపు గా నిజాలే మాట్లాడతాయి.

భారత్ ప్రభుత్వ మంత్రి మండలి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయ పూర్వకం గా మద్దతు ఇచ్చింది.

ఈ సహాయం అంతా భావోద్వేగాలతో ముడిపడిన మద్దతు.

ఆంధ్రప్రదేశ్ కు కావలిసిన అన్ని విషయాల్లో సహాయ సహకారాలు ఎంతో వేగంగా ఎంతో ముందస్తు గా చేయటం జరిగింది.

ఇదంతా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆశీర్వాదం లేకుండా జరిగి ఉండేది కాదు.

ఇంకా  లక్ష్యం పూర్తి కాలేదు.

పనులు పురోగతి లో ఉన్నాయి.

ఇప్పుడు మనముందు ఉన్న సవాల్ వేగం గా ప్రాజెక్టులు పూర్తి చేయటం మరియు దేనికోసం కేటాయించిన నిధులు వాటికోసం ఖర్చు పెడుతూ ఈ పధకాలు ఫలాలు ప్రజలకు సకాలం లో చేరువయ్యేలా చూడాలి.

ఇప్పటివరకు చేసిన దానికి  ప్రశంసించ క పోయినా పర్వాలేదు కనీసం అంగీకరీంచండి.