Tuesday, 22 November 2011

ప్రియ మిత్రులారా, 
                               ప్రకృతిపరంగా లభించే  జీవనాధారమైన మంచినీటిని, కొనుక్కుని త్రాగాల్సిన దుస్తితేనా అభివృద్ధి? ప్రకృతినుంచి దూరమవటమే, నాగరికత అయితే, వికృతికి బలికావాల్సి వస్తుంది. భవిష్యత్ తరానికి మంచినీటిని కూడా అందించలేని, ఈ విపరీత ధోరణికి ఎవరు కారణం?
ఈ వ్యాపార దోపిడీని నేర్పిన బహుళజాతి విదేశీకంపెనిలా?  వాటికి గుడ్డిగా 
దాసోహమన్న రాజకీయ పాలకులా? అన్నింటిని మౌనంగా భరిస్తూ, వెర్రిగా అనుసరిస్తున్న జనమా? {మనమా?}  ఇప్పటికైనా ఆలోచిద్దాం,
అనాలోచిత అనుకరణలకు స్వస్తి పలుకుదాం.

Monday, 21 November 2011

అందరికి నమస్కారం .
ఆలోచనా పరులంతా ఒక్కటై దేశాభివృద్ధికి పనిచేయలన్నదే ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దేశ్యం.

ఈవారం విషయం


భారత జాతీయ పతాకాన్ని "బ్రిటీష్" సాల్యూట్ద్వారానే గౌరవించాలా ?
ఈవిషయంపై మీ అభిప్రాయాన్ని తెలుపగలరని కోరుతూ ...
మీ కార్తికేయ మణికుమార్
9705594699
9705595699